అన్నయ్యే చీఫ్ గెస్ట్..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఈ నెల 19న హోటెల్ నోవాటెల్ లో జరుగనుంది. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రిలీజ్ అయిన రెండు సాంగ్ అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఆడియో వేడుకకి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవుతున్నారని లేటెస్ట్ టాక్. పవన్ అజ్ఞాతవాసి ఆడియోకి గెస్ట్ గా వచ్చేందుకు చిరు ఓకే చెప్పారని టాక్.

మెగా ఫంక్షన్ లకు పవన్ డుమ్మా కొట్టేస్తాడు.. పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సినిమా ఆడియోకి పవన్ రాలేదు. అయితే తమ్ముడు రాకున్నా అన్నయ్య రాక తప్పదని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రాజకీయంగా కూడా తొలి అడుగులేస్తున్న జనసేన అధినేత పవన్ అన్నయ్యను గెస్ట్ గా పిలవడం పట్ల కూడా ఏదో జరుగుతుంది అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి.