నాని ఎం.సి.ఏ ట్రైలర్.. పాత కథే కాని..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఎం.సి.ఏగా మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీరాం డైరెక్ట్ చేశాడు. ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను పెంచేలా వచ్చిన ఎం.సి.ఏ ట్రైలర్ లో కథ పాతదే అనిపిస్తుంది కాని దర్శకుడు నడిపించిన కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండేట్టు ఉంది.

ముఖ్యంగా నాని, సాయి పల్లవి జోడి సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తుండగా.. నాని వదిన పాత్రలో ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ భూమిక పాత్ర కూడా చాలా వెయిట్ ఉన్నట్టు కనిపిస్తుంది. దేవి మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉండనే ఉంది. ఓవరాల్ గా సినిమా కథ ఎలా అనిపించినా మళ్లీ నాని హిట్ మేనియాను ఈ ఎం.సి.ఏ కంటిన్యూ చేయడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్నది మాత్రం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.