అసలు మహానటి సమంతే..!

సావిత్రి బయోపిక్ గా వస్తున్న సినిమా మహానటి. వైజయంతి మూవీస్ బ్యానర్లో స్వప్నా దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమాలో మహానటి సావిత్రి పాత్రకు న్యాయం చేసేలా హీరోయిన్ గా ముందు సమంతనే అనుకున్నారట. సమంత కూడా అందుకు ఓకే చెప్పిందట. కాని దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ఆ పాత్ర ఓ కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి కీర్తి సురేష్ ను తీసుకున్నారట.

అప్పటికి తెలుగులో కీర్తి సురేష్ నేను శైలజ మూవీ మాత్రమే రిలీజ్ అయ్యింది. అయితే అనుకోకుండా ఆమె వరుస అవకాశాలను అందుకుని స్టార్ క్రేజ్ దక్కించుకుంది. అయితే అది కూడా మహానటి సినిమాకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. హీరోయిన్ గా కీర్తి తన అభినయంతో ఆకట్టుకుంటుండగా మహానటి తను సత్తా మరింత చాటేలా చేస్తుంది. ఇక కీర్తి సావిత్రి రోల్ కు ఎంపిక కాగా ఆ సినిమాలో సమంత ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందట. మొత్తానికి అసలు మహానటి సమంత కావాల్సి ఉన్నా డైరక్టర్ సమంత ప్లేస్ లో కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసుకున్నాడట.