కబాలిని మించిన కాలా.. లుక్కు ఓకే మరి మ్యాటర్ సంగతేంటో..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా.రంజిత్ డైరక్షన్ లో వచ్చిన కబాలి టీజర్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కబాలిరా అంటూ సంచలనాలు సృష్టించిన ఆ సినిమా టీజర్, రజిని లుక్ సినిమా ఓ పెను సంచలనం సృష్టించడం ఖాయమని అనుకున్నారు. తీరా సినిమా వచ్చాక నిరాశ చెందక తప్పలేదు. అయినా సరే మళ్లీ రంజిత్ డైరక్షన్ లో కాలా సినిమా చేస్తున్నాడు రజిని.

ఈరోజు రజిని పుట్టినరోజు సందర్భంగా కాలా సెకండ్ లుక్ రివీల్ చేశారు చిత్రయూనిట్. కబాలి లుక్ లా అనిపిస్తున్నా ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు రజినికాంత్. సినిమాలో మాఫియా డాన్ గా కనిపించబోతున్న రజిని ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచడం వరకేనా సినిమా కూడా ఈ రేంజ్ లో ఉండేలా జాగ్రత్త పడతారా అంటూ కామెంట్లు విసురుతున్నారు. కబాలిని మించే లుక్ తో అలరిస్తున్న కాలా కబాలి ఇవ్వని హిట్ కిక్ ఇస్తున్నా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.