
కన్నడలో సూపర్ హిట్ అయిన దండుపాళ్యం సినిమా గురించి అందరికి తెలిసిందే. ఆ సినిమాకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. శ్రీనివాస రాజు డైరక్షన్ లో వచ్చిన దండుపాళ్యం తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక రీసెంట్ గా ఆ దర్శకుడు శర్వానంద్ కు ఓ కథ చెప్పాడట. కథ కొత్తగా ఉండటంతో శ్రీనివాస రాజుకి ఓకే చెప్పాడట శర్వానంద్.
తన ప్రతి సినిమాకు ప్రయోగం చేయాలని చూసే శర్వానంద్ ఈమధ్య కాస్త కమర్షియల్ బాట పట్టాడని చెప్పొచ్చు. అయితే తన ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండేందుకు ఇప్పుడు మరో కొత్త కథతో వస్తున్నాడట. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ ఇయర్ శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో హిట్ అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.