
లవర్ బోయ్ నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు త్రివిక్రం కథ అందించగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా గుర్తుందా శీతాకాలం అని పెట్టబోతున్నారట. వెరైటీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో నితిన్ పక్కన లై భామ మేఘా ఆకాష్ నటిస్తుంది.
లై సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ అది కాస్త నిరాశ పరచే సరికి ఈసారి పక్కా హిట్ కొట్టేలా జాగ్రత్తలు పడుతున్నాడట. ఇక ఈ సినిమా తర్వాత సతీష్ వేగేశ్న డైరక్షన్ లో శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా చేస్తున్నాడు నితిన్. మరి రెండు క్రేజీ ప్రాజెక్టులే కాబట్టి సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.