
గురు తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సినిమా షురూ చేశాడు విక్టరీ వెంకటేష్. తేజ డైరక్షన్ లో ఈరోజు తన తర్వాత సినిమా మొదలు పెట్టాడు వెంకటేష్. ఆట నాదే వేటా నాదే అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుందని అన్నారు కాని ఫైనల్ గా దేవసేన అనుష్కను ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కూడా స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది.
రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ ఆ వెంటనే వెంకటేష్ సినిమా చేయడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సైజ్ జీరో కోసం లావెక్కిన అనుష్క ఇన్నాళ్లకు సన్నబడి మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే అనుష్క వెంకటేష్ తో చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లి కలిసి నటించింది మరి ఈ సినిమాలో వెంకటేష్ తో అనుష్క చేసే రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.