2.0కి తెలుగు నిర్మాత వార్నింగ్..!

రోబో సీక్వల్ గా శంకర్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్, ఎమీ జాక్సన్ లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా 2.0. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమా అప్పీల్ తో వస్తున్న ఈ 2.0 సినిమాకు తెలుగు రిలీజ్ విషయంలో పెద్ద కష్టం వచ్చి పడింది.

సినిమా నిర్మాత లైకా అధినేత 2.0 ఏప్రిల్ లో రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే కోలీవుడ్ మీడియా చెబుతున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 27నే 2.0 కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇది అఫిషియల్ అవునా కాదా తెలియదు కాని ఏప్రిల్ 27న ఇప్పటికే మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతున్నాయి. వాటిలో ఓ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈమధ్యలో రజిని సినిమా రావడం పట్ల బన్ని వాసు స్పందించాడు. అనువాద చిత్రాల మీద గౌరవం ఉన్నా ప్రాంతీయ సినిమాలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది లేదని. దీనిపై నిర్మాతల మండలిలో కూడా మాట్లాడుతాం అని అన్నారు.

మహేష్ భరత్ అను నేను సినిమా దర్శక నిర్మాతలతో చర్చలు నడుస్తున్నాయని చెప్పిన బన్ని వాసు దాదాపు తమ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పకనే చెప్పాడు. వక్కంతం వంశీ డైరక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సినిమామే నెలకు వాయిదా పడుతుందని టాక్. మరి బన్ని వాసు విన్నపం లాంటి వార్నింగ్ ను 2.0 దర్శక నిర్మాతలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.