సీత రామునికోసం ట్రైలర్.. ఇంట్రెస్టింగ్..!

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎన్నొచ్చినా సరే కొత్త స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు కొత్తరకం కథలతో వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఆ తరహాలోనే వస్తున్న సినిమా సీత రామునికోసం. అనీల్ గోపిరెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తో సినిమా మీద మంచి భావన కలిగేలా చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ అంటూ రాబోతున్న ఈ ట్రైలర్ లో సినిమా కథ ఏంటన్నది కొద్ది కొద్దిగా తెలుస్తున్నా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది అన్నది మాత్రం చెప్పొచ్చు.

ట్రైలర్ లో ముఖ్యంగా డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. శరత్ శ్రీరంగం, కారుణ్య లీడ్ రోల్స్ లో చేస్తున్న ఈ సినిమాలో తాగుబోతు రమేష్ కామెడీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది. దాన్ నందన్, సరితా గోపిరెడ్డి, శిల్పా శ్రీరంగం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల రిలీజ్ కానుంది. చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటే ఆడియెన్స్ ఎట్రాక్ట్ అవుతున్న ఈ రోజుల్లో సస్పెన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న సీత రామునికోసం అంటూ రాబోయే ఈ సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. 

డిసెంబర్ లో వరుస సినిమాలు ఉన్నా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. మరి సీత రామునికోసం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.