
హీరోగా కెరియర్ మొదలు పెట్టి బుల్లితెర మీద వ్యాఖ్యాతగా కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో నవదీప్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక తనకు నచ్చిన హీరో పవన్ అంటూ చెప్పుకొచ్చిన నవదీప్ పవన్ కాబోయే సిఎం అంటూ సంచలన కామెంట్ చేశాడు. ఇంటర్వ్యూలో అడిగే రాపిడ్ ఫైర్ లో కాబోయే సిఎం ఎవరని అడుగగా సెకన్ ఆలోచించకుండా పవన్ అనేశాడు నవదీప్.
హీరోలెవరైనా సరే పొలిటికల్ స్టేట్మెంట్ లు కాని.. లేదా రాజకీయాల మీద అభిప్రాయం తెలిపేందుకు కాని ఇష్టపడరు. అయితే సిఎం క్యాండెట్ పవన్ అని చెప్పడానికి నవదీప్ ఏమాత్రం ఆలోచించలేదు. అంటే కచ్చితంగా తనకో స్ట్రాంగ్ ఒపినియన్ ఉందని చెప్పకనే చెప్పాడు నవదీప్. ఈమధ్యనే మన ముగ్గురి లవ్ స్టోరీ అంటూ ఓ వెబ్ సీరీస్ చేసిన నవదీప్ హీరోగా రెండు మూడు కథలను వింటున్నట్టు తెలుస్తుంది.