డిజె భామ అదిరిపోయే ఛాన్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకున్న పూజా హగ్దె అంతకుముందు రెండు సినిమాలు నటించినా డిజెలో బికిని లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలిచింది. అందుకే అమ్మడికి ఇక లక్కీ ఆఫర్లు వస్తున్నాయి. డిజె ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా శ్రీనివాస్ బెల్లంకొండ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్దె ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో నితిన్ సరసన పూజా హెగ్దె ఫైనల్ అయ్యిందట.

శతమానం భవతితో హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న మరోసారి అలాంటి కథతోనే శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ ను అనుకోగా అమ్మడు ఎందుకో సినిమా చేయనందట అందుకే ఈ ఆఫర్ పూజా హెగ్దెని వరించింది. వరుస అవకాశాలతో డిజె భామ అదరగొట్టేస్తుంది. అమ్మడి ఫాం చూస్తుంటే టలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించేలానే ఉంది.