
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరాం హీరోగా సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. భాను శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక అనే కొత్త హీరోయిన్ నటిస్తుందట. సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ స్టేట్మెంట్ వస్తుందట.
అంతేకాదు సినిమా ప్రారంభాన్ని రామానాయుడు స్టూడియోలో పెద్ద ఈవెంట్ గా చేస్తారట. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అభిరాం హీరోగా కెరియర్ మొదటి స్టెప్ వేయనున్నాడు. సురేష్ బాబు తనయుడిగా కాకుండా టాలెంట్ తో స్టార్ ఇమేజ్ సంపాదించాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా అభిరాం కు ఎలాంటి డెబ్యూ ఇస్తుందో చూడాలి.