సుమంత్ మళ్లీరావా ట్రైలర్.. ప్రయత్నం ఫలించేలా ఉందే..!

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుమంత్ మళ్లీరావా అంటూ మరో ప్రయత్నం చేస్తున్నారు. నరుడా డోనరుడా అంటూ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కీ డోనార్ సినిమా రీమేక్ చేసిన సుమంత్ ఆ సినిమాతో తనకు అలవాటైన ఫ్లాపే మూటకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం మళ్లీరావా అంటూ ఓ సినిమాతో వస్తున్నాడు సుమంత్. సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు గౌతం డైరక్షన్ లో వస్తుంది. లవ్, బ్రేకప్, సెంటిమెంట్ ల కలయికతో వస్తున్న ఈ సినిమాలో సుమంత్ చెప్పిన డైలాగ్ నువ్వు నా దగ్గరగా ఉన్నపుడు ఇష్టపడడం.. దూరంగా ఉన్నపుడు బాధపడ్డం.. దాన్ని మించి నాకేం తెలీదు మాత్రం అందరికి నచ్చేసింది. సినిమా ట్రైలర్ చూస్తే ఈసారి సుమంత్ ప్రయత్నం ఫలించేలా ఉందని అంటున్నారు.