మైత్రి మూవీస్ భారీ సినిమాల ప్లాన్..!

మహేష్ శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీస్ ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం, నాగ చైతన్య సవ్యసాచి సినిమాలను నిర్మిస్తుంది. ఇక ఈ ప్రొడక్షన్ వరుసగా 12 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండలకు అడ్వాన్సులు ఇవ్వగా మహేష్, పవన్, ప్రభాస్ లకు కూడా అడ్వాన్సులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మహేష్, త్రివిక్రం కాంబినేషన్ ను మైత్రి సెట్ చేసింది.

ఇక మరో పక్క పవన్ సంతోష్ శ్రీనివాస్ సినిమాకు అడ్వాన్సులు ఇచ్చిందట. ప్రభాస్ సినిమాకు ఇంకా డైరక్టర్ ఫిక్స్ అవ్వలేదట. ఇక వీరితో పాటుగా రవితేజ, అఖిల్, సాయి ధరం తేజ్ లతో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నారట మైత్రి మేకర్స్. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అందరితో మైత్రి ప్లాన్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా మైత్రి మంచి క్రేజ్ సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.