ఒక్క క్షణం ఫస్ట్ లుక్..!

అల్లు శిరీష్ హీరోగా వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒక్క క్షణం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. శ్రీరస్తు శుభమస్తు తర్వాత అల్లు శిరీష్ చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నిఖిల్ హీరోగా ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో ఒక్క క్షణం రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అంచనాలను పెంచేసింది. 

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమాతో ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేశారు. ఆ డేట్ కు ముందు రెండు రోజుల్లో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే అల్లు శిరీష్ మాత్రం ఒక్క క్షణం మీద పూర్తి కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.