ఆ రీమేక్ పవన్ చేస్తాడట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న అజ్ఞాతవాసి పూర్తి చేశాక కొద్దికాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న సందర్భంగా పవన్ ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటాడని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రం మూవీ పూర్తి కాగానే ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమవుతాడని అనుకున్నారు. కాని ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్.

తమిళ సూపర్ హిట్ సినిమా వేదాలం రీమేక్ పవన్ చేస్తాడని ఎన్నాళ్ల నుండో వినిపిస్తున్న మాట. నీశన్ డైరక్షన్ లో కొబ్బరికాయ కొట్టి మరి ఆ సినిమా మధ్యలో ఆపేశారు. అయితే ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ మాత్రం వేదాలం రీమేక్ పవన్ చేస్తారని త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని షాక్ ఇచ్చాడు. రత్నం నిర్మిస్తున్న ఆ సినిమా నిజంగా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.