అఖిల్ తో పోటీ నాని రియాక్షన్..!

అక్కినేని అఖిల్ రెండవ సినిమాగా రాబోతున్న హలో డిసెంబర్ 22న రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఆ సినిమాకు ఒకరోజు ముందే నాని సినిమా రిలీజ్ ఫిక్స్ అయ్యింది. మొన్నమధ్య నాని సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యిందన్న వార్తలు వచ్చినా సరే ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్ పోస్టర్స్ తో నాని సర్ ప్రైజ్ ఇచ్చాడు. డిసెంబర్ 21న నాని ఎం.సి.ఏ రిలీజ్ పక్కా అని తేలింది.

ఇక అఖిల్ తో పోటీపై అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన నాని అఖిల్ తో నాకు పోటీ కాదు అఖిల్ నేను కలిసి సల్మాన్ తో పోటీ పడుతున్నాం అని తెలివైన సమధానం చెప్పాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి టైగర్ కు హలో చెప్పబోతున్నాడు అంటూ మూడు సినిమాల టైటిల్స్ కవర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. నాని తెలివికి అభిమాని ఫిదా అయ్యాడు. మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి పోటీగా అఖిల్ సినిమా నిలబడగలుగుతుందా లేదా అన్నది చూడాలి.