
కలక్షన్ కింగ్ మోహన్ బాబు కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సినిమా గాయత్రి. పెళ్లైనకొత్తలో సినిమా దర్శకుడు మదన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీయ శరణ్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. సినిమా ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆరెఫ్సిలో నందమూరి బాలకృష్ణ హీరోగా జై సింహా సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
గాయత్రి, జై సింహా రెండు పక్క పక్కనే షూటింగ్ జరుపుకుంటుండగా గాయత్రి సెట్స్ లోకి సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడట బాలయ్య బాబు. బాలయ్య రావడం ఊహించని చిత్రయూనిట్ షాక్ అయ్యిందని తెలుస్తుంది. సెట్ లో మోహన్ బాబుతో కాసేపు మాట్లాడిన బాలకృష్ణ సినిమా షూటింగ్ ను పర్యవేక్షించారట. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్వీట్ ద్వారా తెలియచేసి బాలయ్య ఎంట్రీ తమ టీం కు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని మెసేజ్ పోస్ట్ చేశాడు.