కీర్తి సురేష్ కూడా మొదలుపెట్టింది..!

మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన భామలకు టాలీవుడ్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. అందానికి అందం దానికి మించిన అభినయం సొంతం చేసుకున్న ఈ భామలు ఇప్పుడు తెలుగులో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం వారిలో కీర్తి సురేష్ హవా గురించి తెలిసిందే. చేసిన రెండు సినిమాలతో తెలుగులో పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది అమ్మడు. ఇక అదే కాకుండా సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమాలో కూడా నటిస్తుంది కీర్తి సురేష్.

తెలుగులో తనకు వచ్చిన ఈ క్రేజ్ ను కొనసాగించేందుకు అమ్మడు తెలుగు భాష కూడా నేర్చేసుకుందట. అంతేకాదు పవన్ తో నటిస్తున్న సినిమాకు తన డబ్బింగ్ తానే చెప్పుకుందట. అదే విషయాన్ని వెళ్లడిస్తూ ట్విట్టర్ లో పిక్ షేర్ చేసింది కీర్తి సురేష్. పవన్ సినిమాతో తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేసిన అమ్మడు ఆ సినిమా హిట్ అయితే ఇక తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుందని తెలుస్తుంది.