
టాలీవుడ్ క్రేజీ జంట నాగార్జున అనుష్క మళ్లీ కలిసి నటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ సర్కిల్స్. ప్రస్తుతం ఆర్జివితో సినిమా చేస్తున్న కింగ్ నాగార్జున ఆ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ అనుష్కనే సెలెక్ట్ చేశారని టాక్. కొన్నాళ్లుగా ఈ సినిమాలో టబు నటిస్తుంది అంటూ వార్తలు రాగా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఇక ఇప్పుడు నాగార్జునతో రొమాన్స్ చేసేది అనుష్కనే అంటున్నారు.
రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలోనే యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇక మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక అఖిల్ హలో తర్వాత రెండవ షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ తో అనుష్కకు లైఫ్ ఇచ్చిన నాగార్జున సినిమా అంటే స్వీటీ కాదనే ఛాన్సే లేదు. ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమా షూటింగ్ లో ఉంది.