త్రివిక్రం నిర్మాత మారుతితో ఫిక్స్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమాలు చేస్తూ లాభాలు గడిస్తున్న రాధాకృష్ణ ఇప్పుడు తన ప్రొడక్షన్ లో మరో దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారి చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయ్యేలా చేసుకునే మారుతి ఈమధ్య వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. అందుకే త్రివిక్రం తర్వాత మారుతి బెస్ట్ అనుకున్న రాధకృష్ణ అతనితో సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శైలజా పాత్రలో రమ్యకృష్ణ కాని శ్రీదేవి కాని నటించే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రం తర్వాత మారుతితో జత కట్టడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట.