
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయమైన నాగ శౌర్య కుర్ర హీరోల్లో ఎలాంటి పాత్రనైనా చేసే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నారా రోహిత్ తో జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ అందుకున్న నాగ శౌర్య ఈసారి మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నమే ఛలో సినిమా. కన్నడ కిరిక్ పార్టీ భామ రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.
నాగ శౌర్య సొంత నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను వెంకీ కొడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. 1953లో తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయిన సందర్భంలో తిరుప్పురం ఊరికి సంబందించిన నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది. సినిమా కథ కొద్దిగా మాత్రమే చూపించి హీరో క్యారక్టర్ ఎక్స్ పోజ్ చేసిన ఈ టీజర్ నాగ శౌర్య సత్తా ఏంటో చూపిస్తుందని అంటున్నారు. సొంత నిర్మాణంలో సినిమా అంటే కచ్చితంగా సినిమాకు ఎంత కష్టపడతారో తెలిసిందే. మరి నాగ శౌర్య కోరుకునే కమర్షియల్ హిట్ ఈ సినిమా ఇస్తుందా లేదా అన్నది చూడాలి.