
అలా హిట్ కొట్టాడో లేదో మళ్లీ సంచలన కామెంట్స్ తో సిద్ధార్థ్ హాట్ టాపిక్ గా మారాడు. ముఖ్యంగా మసాలాగాళ్లకు అన్న కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే తెలుగులో 15 సినిమాల దాకా చేసిన సిద్ధార్థ్ తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని అందుకే తాను అప్పట్లో కామెంట్ చేశానని అన్నారు. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులకు ఎక్కదు అన్న కామెంట్ సిద్ధార్థ్ ను హైలెట్ అయ్యేలా చేసింది. తెలుగు ప్రేక్షకుల గురించి అనడానికి సిద్ధార్థ్ ఎవడు అన్న విమర్శలు వచ్చాయి.
అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గృహం సినిమా సక్సెస్ తో తెలుగు హీరోగా తనకు ఓ అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని. ఇప్పటికి టాలీవుడ్ పై తాను కామెంట్స్ చేస్తుంటానని.. తాను ఎక్కడి నుండి వచ్చింది అన్నది కాకుండా.. తెలుగు ఎంత బాగా తెలుసు.. ఏం మాట్లాడుతునానో తెలుసుకుంటే మంచిది అంటున్నాడు సిద్ధార్థ్. నా గురించి తెలిసిన వాళ్లతోనే నేను మాట్లాడతా మిగతా మసాలాగాళ్లతో నాకు అవసరం లేదు అంటూ మళ్లీ సంచలన కామెంట్ తో గొడవ మొదలు పెట్టాడు సిద్ధార్థ్.