రకుల్ జాగ్రత్త పడక తప్పదు..!

క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈమధ్య ఏమైంది.. ఆమె ఎందుకు పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. ఎన్నో అంచనాలతో వచ్చిన స్పైడర్ నిరాశ పరచగా ఆ సినిమాలో అమ్మడి పాత్ర ఉన్నా లేకున్నా ఒకటే అనుకున్నారు. అసలు స్పైడర్ మహేష్, మురుగదాస్ కాంబో అనే రకుల్ ఓకే అన్నదంటూ విమర్శలు చేశారు.

అయితే మళ్లీ అలాంటి తప్పే మరోసారి చేసింది రకుల్. ఈ శుక్రవారం రిలీజ్ అయిన కార్తి ఖాకి సినిమాలో రకుల్ ఏమాత్రం ఆకట్టుకోలేని పాత్ర చేసింది. సినిమాలో ఏదో హీరోయిన్ ఉండాలి అన్నట్టు రకుల్ పాత్ర ఉంటుంది. అసలు ఎందుకు రకుల్ ఈ పాత్ర చేయాల్సి వచ్చిందో ఎవరికి అర్ధం కాలేదు. క్రేజ్ ఉన్నప్పుడే మంచి అవకాశాలను అందుకోవాలి కాని రకుల్ ప్రస్తుతం అంత ఇంపార్టెంట్ రోల్ ఏమి చేయట్లేదు. స్టార్ సినిమా అయితే చాలు అనుకుంటున్న రకుల్ కెరియర్ లో ఇక నుండి జాగ్రత్త పడక తప్పదని అంటున్నారు.