అఖిల్ 'హలో' టీజర్.. స్టంట్స్ అదిరిపోయాయ్..!

అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. నాగార్జున వాయిస్ ఓవర్ తో మొదలయ్యే టీజర్ మొత్తం అఖిల్ అదిరిపోయే స్టంట్స్ తో సూపర్ అనేలా ఉంది. 40 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. సోల్ మేట్ ను వెతికే కథాంశంతో వస్తున్నట్టుగా ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. అఖిల్ సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ ఏరికోరి మరి ఎంచుకున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.