
కమెడియన్ గా సూపర్ ఫాంలో ఉన్న సప్తగిరి హీరోగా మారి చేసిన మొదటి ప్రయత్నం సప్తగిరి ఎక్స్ ప్రెస్.. ఆ సినిమా ఎలాగోలా గట్టెక్కేయడంతో ఈసారి మాస్ ఇమేజ్ తో సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమా చేశాడు. పరుచూరి బ్రదర్స్ కథ అందించిన ఈ సినిమాను చరణ్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ చరణ్ ను రిలీజ్ చేయాల్సిందిగా కోరాడట సప్తగిరి. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకి ఏకంగా పవర్ స్టార్ ను ఆహ్వానించిన సప్తగిరి ఈసారి మెగా పవర్ స్టార్ ను వాడేస్తున్నాడు.
సప్గగిరికి మెగా సపోర్ట్ దండిగా ఉన్నట్టు కనిపిస్తుంది. సప్తగిరి కోరిక మేరకు ట్రైలర్ రిలీజ్ కు రాం చరణ్ కూడా ఓకే అన్నట్టు టాక్. మొత్తానికి అటు కమెడియన్ గా ఇటు హీరోగా సప్తగిరి ఓ సరికొత్త ట్రాక్ మెయింటైన్ చేస్తున్నాడు. సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లేలా మెగా సపోర్ట్ తీసుకుంటున్న సప్తగిరి ఈ సప్తగిరి ఎల్.ఎల్.బితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.