ఆ మల్టీస్టారర్ ఇక లేనట్టే..!

మెగా నందమూరి మల్టీస్టారర్ అంటూ కొద్దిరోజుల క్రితం వచ్చిన వార్తలు అటు నందమూరి ఇటు మెగా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చాయి. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్.. నందమూరి హీరో కళ్యాణ్ రాం కలిసి సినిమా చేస్తున్నట్టు చెప్పారు. కె.ఎస్.రవికుమార్ చౌదరి డైరక్షన్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మించాల్సి ఉంది. అయితే సినిమా కథలో కళ్యాణ్ రాం కొన్ని చేంజెస్ చెప్పాడట.

రవికుమార్ ఎంత ప్రయత్నించినా సరే కళ్యాణ్ రాం ను మెప్పించట్లేదని తెలుస్తుంది. అందుకే కళ్యాణ్ రాం ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడట. ఇక సాయి ధరం తేజ్ కూడా ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నది టాక్. మొత్తానికి మెగా నందమూరి మల్టీస్టారర్ మీద ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త అని చెప్పొచ్చు.