రకుల్ కు హ్యాండ్ ఇచ్చిన డైరక్టర్..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాస్త ఫాం తగ్గించినట్టు కనిపిస్తుంది. స్పైడర్ తో తెలుగు తమిళ భాషల్లో హిట్ కొట్టేద్దాం అనుకున్న అమ్మడికి పెద్ద షాకే తగిలింది. ప్రస్తుతం కార్తి ఖాకి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అమ్మడు స్పైడర్ డైరక్టర్ మురుగదాస్ నిరాశకు గురిచేశాడు. స్పైడర్ డిజాస్టర్ అవ్వగా తన తర్వాత సినిమా విజయ్ తో చేస్తున్నాడు మురుగదాస్.

ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను అనుకోగా విజయ్ సలహా మేరకు రకుల్ ప్లేస్ లో నయనతారకు అవకాశం ఇస్తున్నారట. రీసెంట్ గా అరాం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న నయనతార స్టార్ సినిమాలకు షాక్ ఇచ్చే సినిమాలతో వస్తుంది. ఓ పక్క ప్రయోగాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్ సినిమాలను ఓకే చేస్తుంది. నయన్ ఎంట్రీతో రకుల్ కు ఛాన్స్ మిస్ అయ్యిందని తెలుస్తుంది.