ఏపి ప్రభుత్వం ప్రకటించిన 2014, 15, 16 నంది అవార్డుల ప్రకటన చిక్కులు తెచ్చి పెట్టింది. 2015 సంవత్సరం ఉత్తమ చిత్రంగా బాహుబలి బిగినింగ్ ఎంపిక చేశారు. అయితే అదే సంవత్సరం వీరనారి రాణి రుద్రమదేవి చరిత్రతో తెరకెక్కిన రుద్రమదేవిని మర్చిపోయారు. అవార్డుల ప్రకటనలో రుద్రమదేవికి స్థానం లేదని తెలుసుకున్న గుణశేఖర్ ప్రశ్నించడం తప్పా అంటూ ఓ లేఖ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలల్లా వ్యాపింపచేసిన రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను రాయితి ఎందుకు కల్పించలేదని అడగడం తప్పా.. ప్రకటించిన నంది అవార్డుల్లో మొదటి స్థానం కాకున్నా రెండు మూడు స్థానాల్లో కూడా రుద్రమదేవి ఎంపిక కాలేదు. తెలుగు జాతి చరిత్రను వీడెవడో వెలికితీసి గుర్తుచేశాడు. అవార్డిచ్చి మళ్లీ గుర్తుచేయడం ఎందుకు అనుకున్నారా అంటూ తన ఆవేదన మొత్తం వెళ్లగక్కాడు గుణశేఖర్. నిజంగానే రుద్రమదేవి సినిమాకు కనీసం జ్యూరీ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.