
టాలీవుడ్ రాజకుమారుడు సూపర్ స్టార్ మహేష్ కు 2015 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ ప్రకటించింది ఏపి ప్రభుత్వం. ఈ అవార్డుతో మహేష్ ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ అవార్డుతో కలిపి మహేష్ మొత్తం 8 నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీమంతుడు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా మహేష్ నంది అవార్డ్ అందుకుంటున్నాడు.
ఇక ఇంతకుముందు నిజం, అతడు, దూకుడు సినిమాలకు నంది అవార్డులను అందుకున్న మహేష్. డెబ్యూ మూవీ రాజకుమారుడు, మురారి, టక్కరిదొంగ, అర్జున్ సినిమాలకు సెప్షల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నాడు. వీటిలో కలుపుకుని మహేష్ తన కెరియర్ లో 8 నంది అవార్డులను కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమాను లైన్ లో పెట్టాడు.