
కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుందని తెలిసిందే. గోవిందా గోవిందా తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్ గా టబు, స్పెషల్ పాత్రలో అమితాబ్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు స్పందించిన వర్మ అసలు ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని అన్నారు. అంతేకాదు బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నాడన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా 2018 సమ్మర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. శివతో వర్మ సత్తా చాటే అవకాశం ఇచ్చిన నాగ్ ఇన్నేళ్ల తర్వాత అంతకుమించిన సినిమాతో వస్తారని చెబుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.