
ఏపి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని తెలుస్తుంది. ముఖ్యంగా 2014 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా లెజెండ్ ఎంపిక చేయడం పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అదే సంవత్సరం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులను గెలిచిన మనంను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
బాలకృష్ణతో నాగార్జునకు ఉన్న దూరమే ఈ అవార్డుల్లో కనబడిందని కొందరు అంటున్నారు. ఏపి నంది అవార్డులపై మెగా కాంపౌండ్ నిర్మాత బన్ని వాసు మెగా హీరోలంతా నంది అవార్డులను పొందేందుకు ఏపి గవర్నమెంట్ నుండి నటన నేర్చుకోవాలి అంటూ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నంది అవార్డుల లొల్లి ఎలా సర్ధుమనుగుతుందో చూడాలి.