
2014, 2015, 2016 సంవత్సరాలకు సంబందించిన నంది అవార్డులను ఏప్రి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కమిటీ ప్రతినిధులు బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు, జీవిత అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని నంది అవార్డులు లిస్ట్ ను ప్రకటించారు. వీటిలో పాటుగా నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డులు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించడం జరిగింది.
2014 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం లెజెండ్.. ఉత్తమ నటుడు బాలకృష్ణ ఎంపికయ్యారు. 2015లో ఉత్తమ చిత్రంగా బాహుబలి బిగినింగ్.. ఉత్తమ నటుడిగా మహేష్ శ్రీమంతుడు సినిమాకు ఎంపికయ్యారు.. 2016 లో ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు.. ఉత్తమ నటుడు ఎన్.టి.ఆర్ ఎంపికయ్యారు. ఎన్.టి.ఆర్ జాతీయ అవార్డుకు కమల్ హాసన్, రాఘవేంద్ర రావు, రజినికాంత్ లను ఎంపిక చేశారు. చిరంజీవికి 2016 సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డ్ ను ప్రకటించారు.