సైరాకు ఈ చిరాకులేంటో..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి షురూ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ లోగోతో సినిమా మీద అంచనాలు పెరిగేలా చేసిన సినిమా ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లింది లేదు. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఇన్నాళ్లు ఆగడానికి కారణం సినిమా యూనిట్ లో గొడవలే కారణమని అంటున్నారు. 

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు కథ పరుచూరి సోదరులు అందించారు. అయితే సినిమాకు మాటలను అందించేందుకు సాయి మాధవ్ ను భాగం చేశారు. సాయి మాధవ్ మరో ఇద్దరిని తీసుకొచ్చి సినిమాలో ఇన్వాల్వ్ చేయిస్తున్నాడట. ఇదంతా నచ్చని సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి అయోమయంలో పడ్డాడట. విషయం చిరు దాకా వెళ్లడంతో వారం లోగా అంతా సెట్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చాడట. చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగ్, తమిళ, హింది భాషల్లో తెరకెక్కనుంది.