
అక్కినేని అఖిల్ విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. అఖిల్ సినిమా డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి అఖిల్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మనం తర్వాత విక్రం కుమార్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి చేస్తున్న ఈ సినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మళ్లోసారి గాల్లో జంప్ చేస్తూ అఖిల్ కనిపించాడు.
పోస్టర్స్ లో కాలు నేలమీద మాత్రం ఉంచట్లేదని కామెంట్లు వస్తున్నా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక ఈ నెల 16న సినిమా టీజర్ వస్తుందట. టీజర్ కూడా కొత్తగా ఉంటుందని తప్పకుండా అక్కినేని ఫ్యాన్స్ ను తప్పకుండా పండుగ చేసుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా అనుకున్నట్టుగా డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేశారు.