ఎన్టీఆర్ వద్దంటే నితిన్ కావాలన్నాడు..!

జై లవ కుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా షురూ చేశాడు. అయితే అది మార్చి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతుందట. ప్రస్తుతం పవన్ సినిమా రిలీజ్ అయితే గాని త్రివిక్రం తారక్ సినిమా మీద పూర్తి కాన్సెంట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ లో దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న చేస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో తారక్ నటిస్తాడని అన్నారు. 

ఈ ప్రాజెక్ట్ నుండి తారక్ తప్పుకున్నాడట. కథలో ఇంకా మార్పులు చేర్పులు చెబుతున్నాడట. దానికి సతీష్ వేగేశ్న కాదన్నాడట. కొన్ని మార్పులు ఓకే కాని కథలో మెయిన్ పాయింట్ మార్చమని అన్నాడట. అందుకే ఆ సినిమా నుండి తారక్ ను తప్పించి నితిన్ తో చేయాలని ఫిక్స్ అయ్యారు. దిల్ రాజు నితిన్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ డీటేల్స్ త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.