
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. శర్వానంద్ తో తీసిన మహానుభావుడు, రవితేజ తో చేసిన రాజా ది గ్రేట్ సక్సెస్ సాధించిన అమ్మడు రీసెంట్ గా వచ్చిన కేరాఫ్ సూర్య సక్సెస్ తో కూడా జోష్ పెంచుకుంది. అయితే హిట్ సినిమా అయినా కేరాఫ్ సూర్య అమ్మడికి ఒకింత నిరాశ మిగిల్చిందని అంటున్నారు. సినిమా డ్యూరేషన్ లో భాగంగా సినిమాలో ఆమె నటించిన సీన్స్ అన్ని ట్రిం చేస్తున్నారట.
సందీప్ కిషన్ హీరోగా సుశీంద్రన్ డైరక్షన్ లో వచ్చిన కేరాఫ్ సూర్య తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. సినిమా మంచి టాక్ వచ్చినా కోలీవుడ్ లో ఆమె ఉన్న సీన్స్ అన్ని 20 నిమిషాల దాకా ట్రిం చేస్తున్నారట. దీనికి ఆమె పర్మిషన్ కూడా తీసుకున్నారట. తెలుగులో మాత్రం ఆమె సీన్స్ ఉంచుతున్నారట. తెలుగులో వరుస విజయాలను అందుకుంటున్న మెహ్రీన్ కౌర్ కేరాఫ్ సూర్యతో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.