శ్రీకాంత్ కు లిఫ్ట్ ఇస్తున్న అరవింద్..!

కొత్త బంగారు లోకం సినిమాతో యువతను ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టూ అంటూ వెంకటేష్, మహేష్ లతో మల్టీస్టారర్ సినిమా చేసిన శ్రీకాంత్ మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత అతనికి అవకాశం ఇచ్చే వారే లేరు. ఏడాది దాటుతున్నా శ్రీకాంత్ అడ్డాల తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం శ్రీంకాంత్ అడ్డాల గీతా ఆర్ట్స్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడని లేటెస్ట్ టాక్.

ఈమధ్యనే ఓ కథ రాసుకోగా అది విన్న అల్లు అరవింద్ సినిమాను ఓకే చేశాడని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండబోతుందట. మెగా హీరో ఈ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా మినిమం బడ్జెట్ అయినా గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి శ్రీకాంత్ సత్తా చాటుకునే అవకాశం ఉందని అంటున్నారు.