
కోలీవుడ్ హీరో కార్తి హీరోగా వస్తున్న సినిమా ఖాకి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమాల విషయాలను పంచుకున్నాడు కార్తి. ఆవారాతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించిన కార్తి నా పేరు శివ సినిమాతో ఇక్కడ హిట్ అందుకున్నాడు. ఇక తన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ ఇమేజ్ సంపాదించాడు.
ఇక కార్తి హీరోగా మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన సినిమా చెలియా. ఆ సినిమా కథ చెప్పినప్పుడే కాస్త కొత్తగా అనిపించిందని.. సినిమా ప్రయోగమే రిజల్ట్ ఆశించకుండా పనిచేశానని అన్నాడు కార్తి. కేవలం మణిరత్నం డైరక్షన్ లో నటించాలనే కోరిక మేరకే ఆ సినిమా చేశానని.. సినిమా చేసే క్రమంలోనే సినిమా ఫ్లాప్ అన్న ఆలోచన వచ్చిందని అన్నారు. అయితే మణి సార్ తో సినిమా చేయడం ఓ గొప్ప అనుభూతని ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నా అని అంటున్నాడు కార్తి.