అజ్ఞాతవాసి అదిరిపోయే డీల్..!

త్రివిక్రం, పవన్ కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లో అదిరిపోయే రికార్డ్ సాధించింది. సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ ఛానెల్స్ పోటీ పడగా ఫైనల్ గా జెమిని టివి 19.5 కోట్లకు దక్కించుకున్నారట.

స్టార్ మా, జీ తెలుగు ఎంత ట్రై చేసినా ఫైనల్ గా జెమినికే అజ్ఞాతవాసి రైట్స్ దక్కాయట. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుండి రిలీజ్ అయిన బయటకొచ్చి చూఒస్తే సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఈ సినిమా దాదాపు 150 కోట్ల దాకా జరుగుతుందని టాక్.