
బిచ్చగాడు అంటూ వచ్చి డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త సంచలనాలు సృష్టించిన విజయ్ ఆంటోనీ ఆ సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత బేతాళుడు పర్వాలేదు అనిపించగా యమన్ నిరాశ పరచింది. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హీరోగా వస్తున్న సినిమా ఇంద్రసేన. శ్రీనివాసన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రాధిక, విజయ్ ఆంటోనీ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో కూడా ఓ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు విజయ్. సినిమా ఆడియో రిలీజ్ నవంబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఆరోజే సినిమాను ఓ 10 నిమిషాలు చూపించేస్తారట. ఇదవరకు బేతాళుడు సినిమాకు ఈ ప్రయోగం చేసిన విజయ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేందుకు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నాడు. బేతాళుడు అంచనాలతో వచ్చినా అంతగా ఆడలేదు. మరి ఈ ఇంద్రసేన అయినా బిచ్చగాడు రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.