సునీల్ తలరాత మార్చేస్తాడా..?

కమెడియన్ గా సూపర్ ఫాంలో ఉన్న సునీల్ కు హీరోగా అవ్వాలన్న ఆలోచన వచ్చింది. మొదట్లో కాస్త పర్వాలేదు అనిపించినా హీరోగా సునీల్ సక్సెస్ రేటు అందరికి తెలిసిందే. అందుకే ఫేడవుట్ అవడం కన్నా మళ్లీ కమెడియన్ గా కంటిన్యూ అవడం కరెక్ట్ అనుకున్నాడు. ఈ క్రమంలో త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబో సినిమాలో మళ్లీ కమెడియన్ గా కనిపిస్తున్నాడు సునీల్.

ఇక ఇది కాకుండానే హీరోగా ప్రయత్నాలు మాత్రం వదలట్లేదు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ 2 కంట్రీస్ సినిమా రీమేక్ లో నటిస్తున్న సునీల్ బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ డైరక్షన్ లో ఓ మూవీకి సైన్ చేశాడట. శ్రీవల్లితో ఫెయిల్యూర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఈసారి ఓ పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా అయినా సునీల్ తలరాత మారుస్తుందేమో చూడాలి.