ఘనంగా చైతూ సమంతల రిసెప్షన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాలో నటించిన నాగ చైతన్య, సమంతలు రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకున్నారు. మనం సినిమా తర్వాత వీరిద్దరు పెద్దలను ఒప్పించి అక్టోబర్ 6న గోవాలో సమంత నాగచైతన్య వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మద్య చెన్నైలో దగ్గుబాటి ఫ్యామిలీ రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది.  

బ్లాక్ అండ్ వైట్ షూట్‌తో నాగచైతన్య సమంత పక్కన నవ్వులు చిందిస్తుండగా.. సమంత రిసెప్షన్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లాంగ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హీరో రామ్ చరణ్‌తో పాటు సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, పూజా హెగ్డే, జయసుధ, నరేష్‌, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.