
డాక్టర్ రాజశేఖర్ యాక్టర్ గా మరోసారి సత్తా చాటిన సినిమా గరుడవేగ. ప్రవీణ్ సత్తారు డెశిషన్ కరెక్టే అనేలా చేస్తూ ఎన్.ఐ.ఎ ఏజెంట్ గా రాజశేఖర్ నటన ఆకట్టుకుంది. ఓవరాల్ గా దాదాపు ఇక పని అయిపోయింది అనుకున్న రాజశేఖర్ మళ్లీ హిట్ కొట్టి తనకు మార్కెట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ సినిమా చూసి అభినందనలు తెలిపిన వారిలో మహేష్ పేరు ప్రస్థావించింది. అది పర్సనల్ గా అని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ట్విట్టర్ లో మరోసారి సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపాడు మహేష్. సినిమా స్క్రిప్ట్, పర్ఫార్మెన్స్, చిత్రయూనిట్ అంతా కష్టపడిన విధానం గురించి మెచ్చుకున్న మహేష్ 'టేక్ ఏ బౌ రాజశేఖర్ ప్రవీణ్ సత్తారు' అంటూ ట్వీట్ చేశాడు. ఇక తనకున్న సమయంలో సినిమా గురించి ట్వీట్ చేసినందుకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
అంతా బాగానే ఉంది కాని ఆల్రెడీ థియేటర్లలోంచి వెళ్లే టైంకు మహేష్ గరుడవేగపై ట్వీట్ చేయడం చూసి లేట్ అయ్యింది బాసు అనేస్తున్నారు. రెండో వారం పర్వాలేదు అన్న టాక్ ఉన్నా కలక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని ట్రేడ్ టాక్. ఫైనల్ గా గరుడవేగ రాజశేఖర్ ప్రయత్నానికి మైలేజ్ మాత్రం సంపాదించుకున్నాడు.