ఎబ్బే ఇదేం పద్ధతి కాదబ్బాయ్..!

నాచురల్ స్టార్ అని ఏనాడైతే స్క్రీన్ నేం తగిలించుకున్నాడో మన వాడి అరాచకానికి అడ్డు అదుపు లేకుండాపోయింది. ఒక్కో హీరో స్టార్స్ దగ్గర నుండి కుర్ర హీరోల దాకా హిట్ కొట్టడం ఎలా అని కిందా మీదా పడుతుంటే చేసే ప్రతి సినిమా ది బెస్ట్ అనేలా చేసుకుంటున్నాడు నాని. డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న నాని ట్రిపుల్ హ్యాట్రిక్ కు నాంధి పలికాడు.

ఇక ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా ఎం.సి.ఏ. వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తేనే నానికి మరో హిట్ అనేలా ఉంది. అసలు నాని సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హిట్ కోసం నానా తంటాలు పడుతుంటే నాని మాత్రం ఇలా వచ్చి అలా హిట్ కొట్టేస్తున్నాడు. అందుకే ఎబ్బే ఇదే పద్ధతిగా లేదంటూ మనసులో అనేసుకుంటున్నారు కుర్ర హీరోలు. 

ఫిదా క్రేజ్ తో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్న ఈ సినిమాలో అమ్మడి లుక్ అదరగొట్టింది. సాధారణంగా హీరో హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తాడు. పెళ్లి చేసుకుందాం అంటాడు. ఇక్కడ సీన్ రివర్స్ సాయి పల్లవి నానిని పెళ్లిచేసుకుందామా అంటుంది. ఇక టీజర్ లో నాని నటన, దేవి మ్యూజిక్ ఎబ్బే అసలు సినిమా ఎప్పుడు వస్తుంది వెంటనే చూసేద్దాం అన్నంత ఊపు తెచ్చింది. కచ్చితంగా నాని ఎకౌంట్ లో మరో హిట్ షురూ అన్నట్టే ఎం.సి.ఏ టీజర్ ఉంది.