అమ్మడికి స్టార్లు ఆనరా.. వాటమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా..!

వచ్చిన ప్రతి అవకాశం అందుకుని ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించే భామలున్న ఈరోజుల్లో వచ్చి రాగానే స్టార్ అవకాశాలు వస్తున్నా సరే కాదు లేదు అంటూ అమ్మడు కాస్త కటింగులు ఇస్తుంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే ప్రేమంతో పలుకరించి ప్రేక్షకులకు పరువాల అఆలను నేర్పించిన అనుపమ. శతమానం భవతితో సూపర్ హిట్ అందుకోగానే తానో స్టార్ హీరోయిన్ అయ్యిందని బిల్డప్ ఇస్తూ అమ్మడు స్టార్ అవకాశాలను కాదనేస్తుందట.

అలాంటిలాంటి ఆఫర్ కాదు ఏకంగా ఎన్.టి.ఆర్ సినిమాకే నో అని చెప్పేంత సీన్ అమ్మడికి ఉందా అని అందరి డౌట్. దిల్ రాజు బ్యానర్లో సతీష్ వేగేశ్న డైరక్షన్ లో శ్రీనివాస్ కళ్యాణం సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో అనుపమను హీరోయిన్ గా తీసుకుందామని ప్రయత్నించగా సారీ అనేసిందట. మరి అమ్మడు ఎందుకు ఈ ఆఫర్ వదులుకుందో తెలియదు కాని అనుపమ చేసిన పనికి వాటమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా అనేస్తున్నారు.

ఇంతకుముందు కూడా రాం చరణ్ ఆఫర్ ను కాదనేసిన అమ్మడు ఇప్పుడు ఎన్.టి.ఆర్ కు షాక్ ఇచ్చింది. మరి ఆమె సరసన నటించడానికి స్టార్లు ఆనరా అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.