
టాలీవుడ్ లో అందం అభినయం ఉన్నా కొందరి భామలకు అదృష్టం కలిసి రాదు. వారిలో చెప్పుకుంటే మొదటిగా రెజినా గురించి మాట్లాడుకోవాలి. రకుల్ తో పాటుగా ఇంచుమించి ఒకేసారి కెరియర్ ప్రారంభించిన రెజినా ఇంకా కుర్ర హీరోలకే పరిమితమైంది. మరో పక్క రకుల్ మాత్రం స్టార్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. అన్ని ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావడం లేదని తెలుస్తుంది.
అందుకే లేటెస్ట్ గా ఓ క్రేజీ ఫోటో షూట్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డది రెజినా. తన హాట్ లుక్స్ తో అమ్మడు షేర్ చేసిన ఈ పిక్ ఒక్కటి చాలు మళ్లీ అమ్మడు ఛాన్స్ దక్కించుకునేందుకు. ప్రస్తుతం చేతిలో నారా రోహిత్ బాలకృష్ణుడు మాత్రమే ఉండగా ఇక సినిమాల్లో డోస్ పెంచేందుకు కూడా రెజినా వెనుకాడట్లేదని తెలుస్తుంది.