పవర్ స్టార్ క్రేజ్ కు షాక్ అయ్యాడు..!

సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా పవన్ సినిమా అన్నగానే ఫ్యాన్స్ లో ఓ ఉత్సాహం ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ కు మాత్రమే కాదు ఆడియోకి ఆ హంగామా ఉంటుంది. ప్రస్తుతం పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి ఒక సాంగ్ బయటకొచ్చి చూస్తే సాంగ్ రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

అందుకే రిలీజ్ అయిన 8 గంటల్లోనే మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. ఈ సాంగ్ కు వచ్చిన ఈ క్రేజీ రెస్పాన్స్ చూసి మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ షాక్ అయ్యాడు. తెలుగులో తన మొదటి ప్రయత్నాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి సమాధానం ఇస్తూ థమన్ ఇదంతా పవర్ స్టార్ పవన్ అంటూ చెప్పుకొచ్చాడు. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అవబోతుంది.