
ఫ్లాపుల్లో ఉన్నా సరే వర్మకు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఈ కాంబోలో మళ్లీ శివ లాంటి అదిరిపోయే సినిమాను ఆశిస్తున్నారు అభిమానులు. అయితే ప్రస్తుతం వర్మ కాన్సెంట్రేషన్ వేరేలా ఉంది. శివ అప్పుడున్న కసి కనబడటం లేదు సినిమా క్వాలిటీ పరంగా ఓకే కాని ప్రేక్షకులను మాత్రం ఇంప్రెస్ చేయడం లేదు. ఇన్నాళ్లకు వర్మతో నాగ్ ఓకే చెప్పడం కూడా అందరికి షాక్ అనిపించింది.
అయితే వర్మకు కండీషన్స్ పెట్టి మరి ఈ సినిమాకు ఒప్పుకున్నాడట నాగార్జున. సినిమా లైన్ చెప్పగానే ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని రమ్మని చెప్పాడట. ఇక స్క్రిప్ట్ మాత్రమే కాదు సినిమా కమిట్ అయ్యాక మన సినిమా పూర్తి చేసిన తర్వాతే ఏ సినిమా అయినా చేయాలనే కండీషన్ పెట్టి మరి వర్మకు ఛాన్స్ ఇచ్చాడట నాగార్జున.