ది గ్రేట్ డైరక్టర్ ఎఫ్-2 అంటున్నాడు..!

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి హిట్ వచ్చినా ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. కొద్దిరోజులుగా అనీల్ మల్టీస్టారర్ సినిమా చేస్తాడని వార్తలు రాగా వాటిని నిజం చేస్తూ అనీల్ ఓ క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేసాడట. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక హీరోగా నటిస్తున్నాడని లేటెస్ట్ టాక్.

ఇక సెకండ్ హీరో ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సినిమా టైటిల్ గా ఎఫ్-2 అని పెట్టబోతున్నాడట అనీల్. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ టైటిల్ తో రాబోతున్నాడు అనీల్. టైటిల్ విచిత్రంగా ఉండగా తప్పకుండా మనోడు డబుల్ హ్యాట్రిక్ కు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్న ఈ దర్శకుడితో సినిమా అంటే నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి వెంకీతో ఈ ఎఫ్-2 ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.